హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూల కోసం వెళ్లి.. చెరువులో శవమై తేలి!

MLG: వెంకటాపురం మండలంలో బతుకమ్మ పూల కోసం బోడి చెరువుకు వెళ్లిన బద్ది వెంకటేశ్వర్లు (50) ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యారు. రెండు రోజుల తర్వాత బుధవారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది. పండుగ సమయంలో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.