కడప జడ్పీ హాల్ వద్ద ఖాజీపేట జడ్పీటీసీ నామినేషన్ పత్రాలను కూటమి నేతలు లాక్కొని చించివేశారని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్ ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడి, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్‌కు అడ్డంకులు సరికాదు: ఓబులేసు యాదవ్


