హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక పథకాలతో ప్రజలకు భరోసా

SDPT: బెజ్జంకిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక సమ్మిళిత పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌బీఐ ఎల్‌డీఓ వెన్న శ్రీనివాస్, బ్యాంకు అధికారులు పాల్గొని బీమా, పెన్షన్, జనధన్ పథకాలతో కలిగే ప్రయోజనాలను వివరించారు. 150 మందికి పైగా ఖాతాదారులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.