MLG: ఏటూరునాగారంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జడ్పీ క్యాంపు కార్యాలయం కోసం నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు ప్రారంభించలేదు. మండల పరిషత్ కార్యాలయానికి అదనపు గదులుగా వినియోగించాలని నిర్ణయించినప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రజాధనం వృథా కాకుండా భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
నిర్మించి ప్రారంభించకుండా వదిలేసి!


