హైదరాబాద్: 28°C
వార్తలు

నిధులు రాక..పనులు ఆగిపోయి!

కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్ల కార్పొరేటర్లకు ప్రస్తుత సమావేశ మందిరం ఇరుకుగా మారడంతో కార్యాలయం పైఅంతస్తులో రూ.70 లక్షల డీఎంఎఫ్ నిధులతో కొత్త హాల్ మొదలుపెట్టారు. రేకులు, గోడలు పూర్తయినా తలుపులు, కిటికీలు, సీలింగ్ మిగిలాయి. బిల్లులు రాక కాంట్రాక్టర్ రూ.30 లక్షలు సొంతంగా పెట్టి 3 నెలలుగా పని ఆపేశారు. ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు.