హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయోడిన్ లోపాన్ని నివారిద్దాం.. ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం!

నంద్యాలలో ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అయోడిన్ లోపంతో థైరాయిడ్ సమస్యలు, పిల్లల్లో మానసిక ఎదుగుదల లోపం వచ్చే ప్రమాదం ఉందని డీఎంహెచ్‌వో డాక్టర్ శారదాబాయి తెలిపారు. ప్రతి ఒక్కరూ అయోడిన్ కలిగిన ఉప్పును వినియోగించాలని, రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని సూచించారు.