AKP: నక్కపల్లి మండలానికి చెందిన వివిధ పార్టీల ఎంపీటీసీ అభ్యర్థులు బుధవారం తొలి రోజు 25 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో టీడీపీ, వైసీపీ, జనసేనతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి వర్థన్ తెలిపారు. నామినేషన్లు వేసే అభ్యర్థులకు సందేహాలు నివృత్తి చేసేందుకు నామినేషన్ కేంద్రం వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
తొలి రోజు దాఖలైన 25 నామినేషన్లు


