VSP: బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో వచ్చే వారంలో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి చేరుకోవాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక


