హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురపోరుకు సర్వం సిద్ధం చేయండి

ELR: ఈ నెల 28న ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలకు జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకుడు మిరియాల వెంకట శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఆర్వోలు, ఏఆర్వోలతో జూమ్ సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.