హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల్లో ఖరారైన పోటీ

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఖరారైంది. ఏలూరు కార్పొరేషన్, నరసాపురం, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల్లో కూటమి, వైసీపీ, కాంగ్రెస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవడంతో స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.