హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో 27 నామినేషన్ల స్వీకరణ

అన్నమయ్య: మదనపల్లెలో బుధవారం 27 ఎంపీటీసీ సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 27 నామినేషన్లు స్వీకరించినట్లు ఆర్ఓ ప్రసన్న తెలిపారు.వీటిలో వైసీపీ నుంచి 17,టీడీపీ నుంచి 9,స్వతంత్ర అభ్యర్థిగా ఒక నామినేషన్ దాఖలైంది.ఇంకా 16 సెగ్మెంట్లకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.సీఐ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.