హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

KMM: మణుగూరు పీవీ కాలనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బూర్గంపాడు మండలం విజయనగర్ కాలనీకి చెందిన కేసుపాక నవీన్ (20) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తున్న సమయంలో ఓ మహిళను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో నవీన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.