హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ

VZM: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం పర్యవేక్షించారు. అక్కడ జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.