VKB: దసరా సెలవులతో కోటపల్లి ప్రాజెక్టు సందర్శకులతో సందడిగా మారింది. సెలవు రోజును ఉత్సాహంగా గడిపేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రాజెక్టుకు చేరుకున్నారు. ప్రాజెక్టు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు దిగారు. చెరువులో బోటింగ్ చేస్తూ ఆనందంగా గడిపారు. దీంతో కోటపల్లి ప్రాజెక్టు పర్యాటకులతో కిటకిటలాడింది.
తెలంగాణ
పర్యాటకులతో కిటకిటలాడిన కోటపల్లి ప్రాజెక్టు


