HNK: వేయి స్తంభాల దేవాలయంలో బుధవారం రుద్రేశ్వరీ అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హంస వాహనంపై అమ్మవారిని కాకతీయుల కోనేరుకు తీసుకెళ్లి వేదమంత్రాల నడుమ త్రిశూల స్నానార్చన వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి గంగు ఉపేంద్ర శర్మ, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ
అమ్మారికి త్రిశూల స్నానార్చన!


