హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే పట్టాలపై మృతదేహం

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం, యర్రగుంట సమీపంలోని రైల్వే పట్టాలపై శాంతినగర్‌కు చెందిన పాయం శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న SI విజయ్ సింహారెడ్డి అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. రైలు ప్రమాదమా, మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.