హైదరాబాద్: 28°C
తెలంగాణ

సందర్శకులతో కిటకిటలాడిన హైదరాబాద్ జూ

MDCL: దసరా సెలవుల సందర్భంగా హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. మూడు రోజుల్లో మొత్తం 57,864 మంది జూను సందర్శించారు. అక్టోబర్ 18న 20,483 మంది, 20న 21,872 మంది, 21న 15,509 మంది జంతువులను వీక్షించారు. పండుగ సెలవుల్లో కుటుంబాలతో కలిసి గడిపేందుకు హైదరాబాద్ జూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.