హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వాలకు బీసీ-ఏ సంఘాల హెచ్చరిక

MDK: ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని రామాయంపేటలో బీసీ-ఏ ఉపకులాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే 57 ఉపకులాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సహాయ నిరాకరణ చేపడతామని హెచ్చరించారు. రజక, నాయిబ్రాహ్మణ, వడ్డెర, మేదర సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.