హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్

PPM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీరఘట్టం ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ బాక్సుల లభ్యతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.