హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెక్షన్ 144 ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ

E.G: రాజానగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ బుధవారం పరిశీలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.వి.రమణను భద్రతా ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాలన్నారు. నామినేషన్ కేంద్రం పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.