CTR: పుంగనూరులోని జెడ్పీ అతిథిగృహంలో ఎన్నికల విధులపై పీఓలు, ఏపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 420 మంది సిబ్బంది హాజరయ్యారు. వారిని రెండు బ్యాచ్‌లుగా విభజించి మాస్టర్ ట్రైనర్లు బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. సిబ్బంది సందేహాలను నివృత్తి చేస్తూ ఎన్నికల విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో ఎన్నికల సిబ్బందికి శిక్షణ


