హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యేతో వరుదు కళ్యాణి భేటీ

VSP: గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డిని వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాజువాకలో వార్డుల వివరాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధిపై చర్చించారు. వైసీపీ అభ్యర్థిగా తన గెలుపు కోసం సహకరించాలని కళ్యాణి కోరారు. గాజువాకలో అత్యధిక వార్డులతో పాటు మేయర్ ఓటింగ్ శాతం పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తిప్పల స్పష్టం చేశారు.