KMR: కామారెడ్డి పరిధిలోని బరంగేడిగి గ్రామానికి చెందిన లక్ష్మణ్ గొండ (34) డ్రైనేజీలో పడి మృతి చెందాడు. గొర్రెల కాపరిగా పనిచేసే అతడు మద్యం మత్తులో బుధవారం తెల్లవారుజామున డ్రైనేజీలో పడినట్లు స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
డ్రైనేజీలో పడి గొర్రెల కాపరి మృతి


