హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టికెట్ దక్కలేదని మాజీ కార్పొరేటర్ నిరసన

VSP: వైసీపీ టికెట్ నిరాకరించడంతో మాజీ కార్పొరేటర్ బిపిన్ జైన్ వినూత్న నిరసనకు దిగారు. డాబాగార్డెన్స్ గత ఉపఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన ఆయన, పలువురు నేతలు టీడీపీలో చేరినా తాను పార్టీలోనే ఉన్నానని తెలిపారు. అయినా టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ, అరగుండుతో రోడ్డుపై వైసీపీకి వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు.