హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ఢీకొని 8 గొర్రెలు మృతి

RR: శంకర్‌పల్లిలో కారు ఢీకొని 8 గొర్రెలు మృతి చెందగా, మరో 18 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. బుల్కాపూర్ వార్డులో అతివేగంగా వచ్చిన కారు గొర్రెలను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తీవ్రంగా నష్టపోయిన గొర్రెల యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.