హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూలేశ్వర స్వామి ఆలయానికి విలువైన వెండి విగ్రహం విరాళం

కోనసీమ: ఆలమూరు మండలం మూలస్థానంలోని మూలేశ్వర స్వామి ఆలయానికి వేచ్చా శ్రీనివాస్ రూ.3.50 లక్షల విలువైన వెండి విగ్రహాన్ని బుధవారం విరాళంగా అందజేశారు. భక్తిశ్రద్ధలతో స్వామివారికి వెండి విగ్రహాన్ని సమర్పించడం పట్ల ఆలయ భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనివాసులు అభినందించారు. ఈ విరాళం ఆలయ ఆధ్యాత్మిక వైభవానికి మరింత తోడ్పడుతుందని భక్తులు అభిప్రాయపడ్డారు.