హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో తొలిరోజు 8 నామినేషన్ దాఖలు

ELR: ఉంగుటూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు బుధవారం ఎనిమిది నామినేషన్లు దాఖలైనట్లు ఆర్వో మోహన్ రావు తెలిపారు. రావులపర్రులో వైసీపీ తరఫున ఇద్దరు, బాదంపూడిలో టీడీపీ తరఫున ఇద్దరు, ఉంగుటూరు-2 స్థానానికి టీడీపీ తరఫున ఒకరు, ఉప్పాకపాడులో జనసేన తరఫున ఒకరు, గోపాలపురంలో టీడీపీ తరఫున ఇద్దరు నామినేషన్లు సమర్పించినట్లు వెల్లడించారు.