హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీపీఎం అభ్యర్థి ధనుంజయ్ నామినేషన్

ASR: చింతపల్లి మండలం తాజంగి ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి సీపీఎం అభ్యర్థిగా పాంగి ధనుంజయ్ పోటీ చేస్తున్నారు. ఈమేరకు బుధవారం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్‌తో కలిసి అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం, గిరిజన హక్కుల పరిరక్షణే లక్ష్యంగా సీపీఎం ఎన్నికల బరిలో నిలుస్తోందని చిన్నయ్య పడాల్, ధనుంజయ్ తెలిపారు.