హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనానికి సిద్ధమైన అమ్మవార్లు

MDK: దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేటలో భక్తి పారవశ్యం నెలకొంది. నిమజ్జన శోభాయాత్రకు అమ్మవారి విగ్రహాలను పుష్పాలు, దీపాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి నామస్మరణలతో పట్టణ వీధులు మార్మోగుతున్నాయి. నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.