హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలపై ఎమ్మెల్యే దగ్గుపాటితో మంత్రి భేటీ

ATP: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో, మంత్రి సత్యకుమార్ యాదవ్ టీడీపీ కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యారు. అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు. కూటమి విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.