హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంగుళం సుద్ధ ముక్కపై అమరవీరుల స్తూపం

SRPT: కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేశ్ చారి మరోసారి తన అద్భుత ప్రతిభతో అబ్బురపరిచాడు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అంగుళం పరిమాణం ఉన్న సుద్ధ ముక్కపై అమరవీరుల స్తూపాన్ని సున్నితంగా చెక్కి వినూత్న కళతో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ప్రస్తుతం ఆయన చెక్కిన చిత్రం పట్టణవాసులను ఆకట్టుకుంటోంది.