హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువ దర్శకుడికి స్నేహితుల సన్మానం

PDPL: యువ దర్శకుడు, ధర్మారం గ్రామానికి చెందిన నార ప్రవీణ్ కుమార్‌ను చిన్ననాటి స్నేహితులు బుధవారం తన స్వగ్రామంలో శాలువాతో సన్మానించారు. ఇటీవల విడుదలైన 'మగాళ్లు జిందాబాద్' సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. కాగా ప్రవీణ్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. మహేందర్ యాదవ్, సతీష్, కిషన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.