ADB: దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ చిత్రు అన్నారు. గుడిహత్నూర్ మండలంలోని మచ్చాపూర్ తండా గ్రామంలో నిర్వహించిన దసరా మహోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు తదితరులున్నారు.
తెలంగాణ
దైవచిందనతోనే మానసిక ప్రశాంతత: అ. కలెక్టర్


