హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మానుష్యంగా మారిన నాగారం వైపు రోడ్లు

MDCL: దసరా పండుగకు నగరవాసులు స్వగ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నాగారం, దమ్మాయిగూడ, ECIL, సైనిక్‌పురి, మౌలాలి ప్రాంతాల్లో సాధారణ రోజులతో పోలిస్తే వాహనాల రద్దీ తగ్గింది. పండుగకు ఊళ్లకు వెళ్లిన తిరిగి నగరానికి చేరుకునే అవకాశం ఉండటంతో రహదారులపై మళ్లీ రద్దీ పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.