CTR: పుంగనూరులో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ఎస్పీ ధీరజ్ బుధవారం పరిశీలించారు. కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ


