హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పించాలి: దినకర్

ASF: జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దినకర్ విమర్శించారు. వర్షానికి పైకప్పు కారడం, కుర్చీలు, ఫ్యాన్లు, తాగునీరు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బస్టాండ్‌ను విస్తరించి ప్లాట్‌ఫారాల సంఖ్యను 20 నుంచి 30కి పెంచాలన్నారు.