NGKL: జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ లో ప్రభుత్వ పాఠశాల ముందు మిషన్ భగీరథ పైపు లీకేజీ మరమ్మతుల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. రోడ్డు పక్కనే గుంత తవ్వడంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి లీకేజీ మరమ్మతులు పూర్తి చేసి, విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
నత్తనడకన మిషన్ భగీరథ మరమ్మతులు


