హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా రోడ్డు మార్గం

SKLM: ఎచ్చెర్ల నుంచి కొయ్యాం, కుప్పిలి, డి.మత్యలేశం, బుడగట్లపాలెం, బడివానిపేట వెళ్లే రోడ్డు మలుపులతో ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు అల్లుకుని ఎదురు వాహనాలు కనిపించడం లేదు. హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పొదలను తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.