హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగర శివార్లలో రూ.5.84 కోట్ల బంగారం

NTR: విజయవాడ శివార్లలో డీఆర్ఐ అధికారులు భారీగా బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ సుమారు రూ.5.84 కోట్లని అంచనా. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్కార్పియో వాహనంలోని రహస్య అరలో దాచిన బంగారంతో పాటు 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలను స్వాధీనం చేసుకున్నారు.