E.G: జాతీయ రహదారిపై నరేంద్రపురం జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. రాజానగరం నుంచి కొత్త వెలుగుబంద వెళ్లేందుకు స్కూటీపై రోడ్డు దాటుతున్న జి. నాగశిరీష, ఎం. వెంకటేశ్వరీలను రాజమహేంద్రవరం వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టిందని సీఐ వీరయ్య గౌడ్ అన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
లారీ ఢీ.. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు


