హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల అభివృద్ధికి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

నంద్యాలలో చిరు వ్యాపారులకు మున్సిపల్ గేట్లు ఎత్తివేస్తామని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఎలిజా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, తాగునీటి సదుపాయం, డ్రైనేజీ మరమ్మతులు, దోమల నివారణకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.