హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిళ హత్య.. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

SRPT: హుజూర్‌నగర్‌లోని సుందరయ్య నగర్‌లో మహిళ హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈరోజు డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టి ఆధారాలు సేకరించారు. బంగారు ఆభరణాల కోసమే హత్య జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గల కారణాలు, నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.