GNTR: తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. 43వ వార్డులో జనసేన అభ్యర్థి కమ్మెల రజిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు చివరి నిమిషంలో వైసీపీ అభ్యర్థి నాగసరపు వందన తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో రజిని ఏకగ్రీవం ఖరారైంది. దీంతో తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తొలి విజయాన్ని నమోదు చేసినట్లయింది.
ఆంధ్రప్రదేశ్
తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ


