NRML: భైంసా పట్టణంలోని బట్టి గల్లీకి చెందిన 11 ఏళ్ల కనికరం అవలిక తల్లిదండ్రులు మృతిచెందడంతో అనాథగా మారింది. బాలిక పరిస్థితి తెలుసుకున్న ఓ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆంజనేయులు దాతల సహకారంతో రూ.15 వేల చెక్కు, 50 కిలోల సన్నబియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుంకేట పోశెట్టి, ఎస్. ప్రకాష్, మునీరోద్దీన్, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అనాథ బాలికకు ఆర్థిక సాయం


