హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలల పార్లమెంట్ మంత్రుల ఎన్నిక

GNTR: ఆత్మకూరులో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళగిరి మండల స్థాయి బాలల పార్లమెంట్ మంత్రులను ఎన్నుకున్నారు. బాలల హక్కుల పరిరక్షణ, గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమాఖ్యను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ ప్రిన్సి, అంగన్‌వాడీ టీచర్ మేరీ రోజమ్మ, గుడ్ షెఫర్డ్ సిబ్బంది ఎన్. నాగమణి, బీ. విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.