హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగిలో దోమల బెడద.. ప్రజల ఆందోళన

VKB: పరిగి పట్టణంలోని 15వ వార్డులో మోరీ తెరిచి ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమల బెడద పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో మోరీ కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.