హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ ఢీకొని యువకుడు మృతి

KNR: శంకరపట్నం మండలంలో విషాదం జరిగింది. లింగాపూర్ గ్రామానికి చెందిన చల్లూరి సాయి వరుణ్ (24) పని నిమిత్తం మెట్పల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మెట్పల్లి గ్రామ శివారులో ఎదురుగా AP 21 TB 0999 లారీ డ్రైవర్ అతివేగంగా ఢీకొట్టడంతో సాయి వరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం మృతుడి తండ్రి చల్లూరి సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.