యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
యాదాద్రిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం


