హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

మార్కాపురం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా బుధవారం తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.