NRML: ఖానాపూర్ పోలీస్టేషన్లో బుధవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసుల సేవలు చిరస్మరణీయమన్నారు.
తెలంగాణ
VIDEO: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి: DSP


